హైదరాబాద్: కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్‌లో ఓ గోదాములో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ గోదాములో కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రి నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువగా ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో దట్టమైన పొగతో పాటు మంటలు కూడా భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో సమీపంలో నివసిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
9010426055
9440023558
Leave a comment