తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడు కోంగిరాము కౌన్సిలర్లకు శాలువా కప్పి శనివారం సన్మానించారు. సన్మానించిన వారిలో మున్సిపల్ కాబోయే చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లను కూడా సన్మానించారు. దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివంగ ముద్దుబిడ్డలను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దేవాంగ సంఘం అధ్యక్షులు కార్యదర్శి లక్కారం సుధాకర్, సత్యప్రసాద్, కోశాధికారి లక్కారం సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు దేవాంగ సభ్యులు ఇట్టి కార్యక్రమాన్ని హాజరై కార్యక్రమాన్ని ఘనవిజయం చేశారు.
Leave a comment