జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరెజ్ చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. లారీ-ద్విచక్రవాహనం ఢీకొన్ని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతిచెందారు. ఈ రహదారిపై మూడు రోజుల్లోనే ముగ్గురు మరణించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ బోరెజ్ చెక్ పోస్టుపై దాడి చేసి అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారిని అదుపుచేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. అనంతరం స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను శాంతింపజేయడానికి అధికారులు చర్చలు జరిపారు.
Leave a comment