Home జనరల్ అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..
జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు అంగరంగ వైభవంగా ఆరంభం కాబోతోంది. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా ప్రఖ్యాతి చెందిన కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు. ఈ మధ్నాహ్నం 1: 30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు.

మరోవంక- రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. అన్ని జిల్లా కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మంగళవారం నాడు వాడవాడలా విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడానికి చురుగ్గా పనులు సాగుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

You cannot copy content of this page