సిద్దిపేట అర్బన్ 17, తెలంగాణ వార్త
బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ మైనారిటీల జనాభా పెరిగిన దానికి అనుగుణంగా 12 శాతం రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. మైనారిటీలకు ఇఫ్తార్ విందులు ఇవ్వడం కాదు వాళ్లకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలుచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి జిల్లా కోశాధికారి రోమాల బాబు, అసెంబ్లీ కోశాధికారి సుజయ్ కుమార్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Leave a comment