Home జనరల్ శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….
జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త::

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art of Parenting ) మరియు అకాడమిక్ ఎక్స్లె లెన్స్ అవార్డ్స్

ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం రోజు “ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ‘” మరియు అకాడమిక్ ఎక్స్ లెన్స్ MR గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేటర్ తిరునగరి శ్రీహరి గారు,( సైకాలజిస్ట్,పేరెంట్ కోచ్ ) మదం మహిపాల్ గారు( ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ ) హాజరయ్యారు.

ఈ కార్యక్రమం మొదటి భాగంలో తల్లిదండ్రుల పాత్ర, పిల్లల మానసిక వికాసం, విలువల పెంపకం, ఆధునిక విద్యా విధానాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి ముఖ్య అంశాలపై వివరంగా మాట్లాడారు. అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లలతో సానుకూలంగా మెలగడం, వారి భావాన్ని అర్థం చేసుకోవడం మరియు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణను పెంపొందించడంలో వారి బాధ్యత ఎంతో అవసరమని, తల్లిదండ్రులకు పిల్లల విజయాల్లో వారి పాత్ర ఎంత ముఖ్యమో సులభంగా అర్థమయ్యేలా వివరించారు.

ఈ కార్యక్రమం రెండవ భాగంలో Edos CEO లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” ని శ్రీ భాషిత పాఠశాల ఎలా వినియోగించుకుంటుంది. అన్న విషయాన్ని వివరించారు. అంతేకాకుండా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది, పోటీ పరీక్షలకు టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, వెనుకబడిన విద్యార్థుల కోసం శ్రీ భాషిత పాఠశాల ఎ పి క్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను ముందంజలో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్న శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ” ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు నిర్వహించాము. ప్రతి తల్లిదండ్రి తన పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం మా బాధ్యతగా భావిస్తున్నాము విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని, వారి అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా అవసరమని తెలిపారు.

అనంతరం విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు IIT/NEET మెడల్స్ మరియు ఒలంపియాడ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల మరియు సాధించిన విజయాలు అభినందిస్తూ వారికి సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ అందజేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page