Home జనరల్ నిన్న నాగార్జున నేడు మురళి మోహన్ కు చెందిన జయభేరి టవర్ ను వదలని హైడ్రా..
జనరల్

నిన్న నాగార్జున నేడు మురళి మోహన్ కు చెందిన జయభేరి టవర్ ను వదలని హైడ్రా..

తెలంగాణ వార్త:: హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. అనుకున్నట్లుగానే హైడ్రా హైదరాబాద్ లోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువులను అక్రమించి కట్టిన కట్టడాలను కూల్చేస్తోంది. ఆక్రమణదారులు ఎవరైనా డొంట్ కేర్ అంటూ.. ముందుకెళ్తోంది. ఇప్పటికే 18 ఎకరాల భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించిందిమాదాపూర్ లో తుమ్మడికుంట చెరువు అక్రమించి కట్టిన ఎన్ కన్వెషన్ కొద్ది రోజుల క్రితం హైడ్రో కూల్చివేసింది. అలాగే దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. దీంతో హైడ్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి. హైడ్రా ఇలానే ముందుకెళ్తే హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడుకొవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా హైడ్రా సిని నటుడు, నిర్మాత, మురళి మోహన్ కు చెందిన జయభేరి షాకిచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు. నోటీసులపై జయభేరీ సంస్థ ఇంకా స్పందించలేదు. అయితే చాలా మంది అక్రమార్కులు చెరువులు కుంటలు కబ్జా చేశారు.
ఆ తర్వాత జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులుక లంచాలు ఇచ్చి నిర్మాణాలకు అనుమతి తీసుకున్నారు. నిర్మాలు చేపట్టారు. ఇప్పుడు వారికి నోటీసులు ఇస్తే కోర్టు వెళ్తున్నారు. తమకు అధికారులే ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని కోర్టుకు చెబుతున్నారు. అయితే లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చిన అధికారులు అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది. అధికారుల తీరు వల్లే చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెబుతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page