Home జనరల్ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేయమైన చర్య… బారాస నేత రవీందర్ యాదవ్…
జనరల్

కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేయమైన చర్య… బారాస నేత రవీందర్ యాదవ్…

ఆంధ్రా గుండాలతో అరికెపూడి దాడులకు పాల్పడటం పై ఆగ్రహం

సంస్కార హీనుడు అరికెపూడి గాంధీ

ప్రజాప్రతినిధిగా ఉంటూ మాట్లాడాల్సిన మాటలు అవేనా..?

ప్రజలు అందుకేనా గెలిపించింది..?

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తాట తీస్తాం

బ్రోకర్లు ఎవరో ప్రజలకు తెలుసని స్పష్టం

అరికెపూడికి దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్

కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ఊసరవెల్లిలా మాటలు మార్చుతున్నారని మండిపాటు

ఎమ్మెల్యే అరికెపూడిపై భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధ్వజం

తెలంగాణ వార్త:: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. ఆంధ్రా గూండాలను దాడికి ఉసి గొల్పిన అరికెపూడి గాంధీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. బూతులతో పాడి కౌశిక్ ను తిట్టారని, అదే మాటలు తాము అనలేక కాదని, తమకు సంస్కారం ఉంది అని వెల్లడించారు. అరికెపూడి గాంధీ ఓ సంస్కార హీనుడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవాం కాదా..? అని నిలదీశారు. మగాడిలా రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. భారాసలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్ని సవట పనులు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారాస నేతలను నోటికి ఏది వస్తే అది అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గురువారం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మాట్లాడాల్సిన మాటలు అవేనా అని గాంధీని ప్రశ్నించారు. అరికెపూడికి కొంచెం సంస్కారం ప్రసాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. శేరిలింగంపల్లి ప్రజలకు ఇప్పుడిప్పుడే నీ బుద్ధి తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన నువ్వు ప్రతిపక్ష పార్టీపలో ఉన్నట్లు ఎలా అవుతుందని నిలదీశారు. ముందు శేరిలింగంపల్లి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. భారాసను విమర్శించే అర్హత అరికెపూడి గాంధీకి లేదని రవీందర్ యాదవ్ అన్నారు. గులబీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. బ్రోకర్ లు ఎవరో శేరిలింగంపల్లి ప్రజలకు బాగా తెలుసని వెల్లడించారు. త్వరలోనే తగిన బుద్ధి చెప్పేందుకు భారాస కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రవీందర్ యాదవ్ అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఓవర్ ఆల్ గా తప్ప లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదు సి.డి.ఎం.ఏ డైరెక్టర్..

తెలంగాణ వార్త:: నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు కు మేనేజర్...

జనరల్

ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ భీమ్ సింగ్ గుండెపోటుతో మృతి..

తెలంగాణ వార్త:: సీనియర్ కంటి వైద్యుడు డాక్టర్‌ భీంసింగ్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన...

జనరల్

సబ్ రిజిస్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తే క్షమించేది లేదు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి పై దస్తావేజులు, రియల్ ఎస్టేట్...

You cannot copy content of this page