తెలంగాణ వార్త:: ఆర్మూర్ లోని పాత బస్టాండ్ లో గల దోండి మెడికల్ హల్ లో బుధవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది. ఆర్మూర్ నడి బొడ్డున పోలీస్ స్టేషన్ పోయే రోడ్డు లో హైవే పక్కనే ఈ దొంగతనం జరిగింది. ఎంహెచ్ 04 BD 2763 అనే వాహనం లో వచ్చిన ఆరుగురు దొంగలు షెటర్ లేపి లోపలికి ప్రవేశించారు.. ఉదయం 4 గంటల ప్రాంతంలో దొంగతనం చేసినట్లు సీసీ.ఫుటేజ్ లో రికార్డ్ ఆయ్యింది… కౌంటర్లో ఉన్న 4 నుంచి 5 లక్షల రూపాయలు, సీసీ ఫుటేజ్ డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారు… నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతంలో ఈ దొంగతనం జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసునమోదు చేసుకున్నారు.
Leave a comment