Home జనరల్ అధికారులను భయపెట్టడానికా!
జనరల్

అధికారులను భయపెట్టడానికా!

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలో గత వారం రోజుల నుంచి ఆర్మూర్ మండలం ప్రభుత్వ అధికారులను ఏసీబీ దాడులు నిర్వహిస్తుందని పుకార్లు పుట్టించడం సరికాదు! ప్రభుత్వ అధికారులు తమ పని తాను చేసుకుంటూ పోతుంటే వారిని వారి పని పట్ల దృష్టి పెట్టనీయకుండా ఫోన్లు చేసి మరి అధికారులను ఆఫీసు నుండి పారిపొమ్మనడం అసలు ఏం జరుగుతుంది అన్న సందేహం అధికారులు వ్యక్తపరుస్తున్నారు. యాంటీ కరప్షన్ అధికారి అంటే ఆషామాషీ కాదు అన్ని సాక్షాలు చూసిన తరువాతే ఎవరి పైన దాడులు నిర్వహించాలా వద్దా అన్నది కూడా ఏసీబీ అధికారులకు హద్దులు ఉంటాయి. ఒక ఏసీబీ అధికారి ఎవరిపైనైనా దాడి నిర్వహించాలనుకుంటే అతని పై అధికారికి ఆయన వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా ఏసీబీ అధికారులు అందరికీ చెప్పి మేము ఆర్మూర్ పట్టణంలో దాడులు నిర్వహించారని అనుకుంటున్నాము. మీకు చెప్తున్నాము. మీరు ఆర్మూర్లో ప్రచారం చేయండి అని ఏ ఏసీబీ అధికారి ఎవరికి చెప్పారు. మరి ఈ పుకార్లు చేసేవారు ఎంతటి ఘనులో అర్థమవుతుంది. ఇలా పుకార్లు పుట్టించి అధికారులను బెదిరిస్తే మాత్రం సమస్య వారిపైనే తిరిగి వస్తదని ఒక ఏసీబీ అధికారి తెలిపారు. పుకార్లు పుట్టిస్తే వారికి తగిన శాస్తి ఉంటుందని తెలంగాణ వార్తకు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్...

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

You cannot copy content of this page