Home జనరల్ జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి

తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది.

ఆయన సేవలు,
ఆయన మార్గం అనితర సాధ్యం

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ సాధనలో ఆయన చేసిన ప్రత్యేక కృషి వెలకట్టలేనిదని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

సోమవారం నెక్లెస్ రోడ్ స్ఫూర్తి స్థల్ లో ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి కృషి ఎనలేనిదని అలాగే అభివృద్దే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా గణనీయమైన సేవలందించారని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అజాతశత్రువు కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని దక్షిణ భారతదేశం నుండి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందటం గర్వకారణమని అన్నారు.
కేంద్ర మంత్రి, ఎంపీ, రాజ్యసభ సభ్యులుగా ఎన్నో సేవలు అందించారని హైదరాబాద్ మెట్రో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఎంతో కృషి చేశారని అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులు అందించారని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ప్రజా సేవకు నిలువెత్తు సాక్ష్యం అని, తెలంగాణ రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. స్టూడెంట్ లీడర్ గా, కేంద్ర మంత్రిగా అటు దేశానికి ఇటు తెలంగాణకు ఎన్నో విలువైన సేవలు అందించారని విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారిని ఉత్తమ పార్లమెంటియంగా అవార్డు అందుకోవటం గొప్ప అవకాశమని అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 15వ లోక్సభలో ఆయనతో కలిసి పని చేయటం సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అనుభవాలు పాఠాలు ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

అంతకుముందు స్ఫూర్తి స్థల్ లో మాజీ కేంద్రమంత్రి కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి ఘాట్ నందు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమిటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,
ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి, శాసనసభ్యులు నవీన్ యాదవ్, నారాయణరెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్, సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి సుదర్శన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు భాస్కరరావు, జూలకంటి రంగారావు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పుర ప్రముఖులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page