ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో కామదహనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పూజారి ఆంజనేయ శర్మ కాలనీ అధ్యక్షులు జి.అశోక్, హనుమాన్ ఆలయ చైర్మన్ శివరాజ్ కుమార్ తో పూజలు చేయించి కామదహనం కార్యక్రమం నిర్వహింపజేశారు. ఈ సందర్బంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఇంటింటికి గుడాలను పంపిణి చేశారు. కాలనీ అధ్యక్షులు జి.అశోక్, ప్రధాన కార్యదర్శి కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, డీకే జగదీశ్వర్, సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు రాజు, సాయన్న, రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు నర్సయ్య, ఆవేజ్, ఆలయ చైర్మన్ శివరాజ్, కార్యదర్శి సతీష్, భూమయ్య కాలనీవాసులు పాల్గొన్నారు.
9440023558
Leave a comment