Home జనరల్ భారీగా ఐపీఎస్ ల బదిలీలు..
జనరల్

భారీగా ఐపీఎస్ ల బదిలీలు..

తెలంగాణ వార్త:: రాష్ట్రంలో అతిత్వరలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు జాబితాపై కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీఎస్‌ అధికారుల పనితీరు ఆధారంగా కొంతమందిని ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి మరోచోటుకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల, మెదక్‌ ఎస్పీలు, కరీంనగర్‌, రామగుండం, వరంగల్‌, ఖమ్మం సీపీలు ఉన్నట్లు సమాచారం. పలువురు డీసీపీలు సైతం బదిలీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఖాళీగా ఉన్న నిజామాబాద్‌ కమిషనరేట్‌ను యువ ఐపీఎస్‌ అధికారితో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతంలో నిజామాబాద్‌లో పనిచేసిన డాక్టర్‌ వినీత్‌ జీ నిజామాబాద్‌ సీపీగా రావచ్చని ప్రచారం జోరందుకుంది. అలాగే సామాజిక సమీకరణల నేపథ్యంలో కోటిరెడ్డిని సైతం నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. త్వరలో బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page