రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ P. రోహిత్ రెడ్డి ,పి.స్వాతి, జగన్నాథ్, శివశంకర్ రెడ్డి లతో కూడిన బృందం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పసుపాముల గ్రామంలో గల ఆల్ రిచ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్( శ్వేత బ్రాండ్ పాలు మరియు పెరుగు) పాలు మరియు పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు జరపగా….తనిఖీల్లో బయటపడ్డ ముఖ్యమైన ఉల్లంఘనలు:
FSSAI లైసెన్స్ ఆల్ రిచ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ( శ్వేత బ్రాండ్ పాలు మరియు పెరుగు)అని పేరుతో వ్యాపారం చేస్తూ బ్రాండ్ పై లైసెన్స్ విషయంలో స్పష్టత లేకుండా విక్రయాలు జరపడం ఫ్లేవర్డ్ మిల్క్ లాంటి పదార్థాలను లైసెన్స్ క్యాటగిరిలో చేర్చకుండా తయారు చేసి నిల్వ చేసి విక్రయించడం పూర్తిగా అపరిశుభ్రత వాతావరణం లో తుప్పు పట్టిన మిషనరీ ఉపయోగించి పాలు మరియు పాల పదార్థాలను ప్రాసెస్ చేయడం తయారు చేసినటువంటి ఫైనల్ ప్రొడక్ట్స్ అంటే మార్కెట్లో సప్లై చేసేటటువంటి పాలు మరియు పాల పదార్థాలను హానికరమైన రసాయనాల తో పాటు ఒకే రిఫ్రిజిరేటర్లు కలిపి ఉంచడం, కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లో పై కప్పు తుప్పు పట్టి ఉండడం, మరియు పాన్,జర్దాలు తిని ఉమ్మి వేసి ఉన్న అపరిశుభ్రత కలిగిన ప్రాంతంలో మూతలు తీసిన పాలు మరియు పెరుగు డబ్బాలను నిల్వ ఉంచడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు పలు FSSA సెక్షన్ల కింద నోటీసులు జారీ చేయడం జరిగింది.
లేబుల్ తదితర వివరములు లేకుండా నెయ్యి ఫ్లేవర్ మిల్క్ మరియు కొన్ని రకములైన పాలను ప్యాకింగ్ చేయడం చేసిన వాటిని ప్రజలకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న వారి యొక్క డైరీ యూనిట్ లో ఉన్న లక్షా అరవై ఎనిమిది వేల రూపాయల విలువ గల 280 కిలోల నెయ్యి ప్యాకెట్లను మరియు పాల నుండి తీసిన 350 కిలోల పాల నుండి తీసిన క్రీమ్ ను అనుమానంతో స్వాధీన పరుచుకొని సీజ్ చేయడం జరిగింది 22వేల 750 రూపాయల విలువగల 850 కిలోల హానికరమైన కాస్టిక్ సోడాను గుర్తించి దానిని పాలలో ఉపయోగిస్తున్నట్టు అనుమానించి అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది. మరియు పాలు మరియు నెయ్యి శాంపిల్ అను సేకరించి పరీక్ష నిమిత్తం లాబ్ కి పంపించడం జరిగింది కల్తీ అని నిర్ధారణ అయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని టాస్క్ ఫోర్స్ హెచ్చరించారు ప్యాకింగ్ తయారీ మరియు స్టోరేజ్ మరియు విక్రయ యూనిట్ చట్టబద్ధమైన లైసెన్స్ లు లేకుండా బిజినెస్ జరుపుతున్నందున ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 ఉల్లంఘించినందుకు గాను చట్ట ప్రకారం వారికి నోటీసులు అందజేయడం జరిగింది.
ప్రజలకు మరియు వినియోగదారులకు, వ్యాపారులకు అవగాహన కోసం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ క్రింది సూచనలు చేయడం జరిగినది.
పాల మరియు పాల ఉత్పత్తుల కల్తీ వలన ఆరోగ్య ప్రమాదాలు
పాలు మరియు పాల ఉత్పత్తులు రోజువారీ జీవితంలో ముఖ్యమైన ఆహార పదార్థాలు. అయితే, వాటి ఉత్పత్తి, నిల్వ, పంపిణీ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇవి కింది విధంగా ఉంటాయి:
పాల భద్రతా లోపాలు
అధిక నీరు కలపడం: పాలలో నీరు కలపడం ద్వారా పోషక విలువ తగ్గిపోతుంది.
రసాయనాల మిశ్రమం: పాలను పాడుకాకుండా ఉంచడానికి ఫార్మలిన్, డిటర్జెంట్ వంటి హానికర రసాయనాలు కలపడం.
అనుమానాస్పద నిల్వ పద్ధతులు: తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే పాలు త్వరగా పాడవుతాయి.
అపరిశుభ్ర ప్యాకేజింగ్: ప్యాకేజింగ్ సమయంలో శుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం.
కల్తీ పాల వల్ల తక్షణమే వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. పాలలో కలిపే రసాయనాలతో కల్తీ పాల వల్ల గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అపరిశుభ్రంగా పాలు ఉత్పత్తి చేయడం వల్ల సూక్ష్మజీవుల ద్వారా పలు వ్యాధులు సోకుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాల్సిందిగా కోరడమైనది.
తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆహార నాణ్యత, మరియు ఆహార పరిరక్షణ మీద తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈ పరిస్థితుల్లో, పాలు పెరుగు మరియు ఇతర ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు ప్రజలకు సురక్షిత ఆహారం అందించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు నోటీసులు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.నిబంధనలు పాటించని, అనుమతులులేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు సూచించడం జరిగింది.
Leave a comment