Home జనరల్ తప్పకుండా డిజె లు పెడతాం. ఎమ్మెల్యే రాజాసింగ్…
జనరల్

తప్పకుండా డిజె లు పెడతాం. ఎమ్మెల్యే రాజాసింగ్…

హైదరాబాద్, తెలంగాణ వార్త:: మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో ఇవాళ సెప్టెంబర్ 26. సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ డీజే, ఫైర్ క్రేకర్స్ బ్యాన్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

డీజే, క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు ఉందని.. ఏదో అందరినీ పిలిచి ఒకమాట చెప్పాలన్నట్లుగా ఇవాళ్టి సమావేశం జరిగిందని అన్నారు. వెహికిల్‎లో స్పీడ్ లిమిట్‎కి ఎలా లాక్ ఉంటుందో.. అదే మాదిరి డీజే సౌండ్ లిమిట్ పెట్టాలని.. అంతేకానీ పూర్తిగా డీజేలను నిషేదించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రోజుకు నాలుగు సార్లు వినిపించే సౌండ్స్ బంద్ చేస్తే.. మా టెంపుల్స్‎లో సౌండ్స్ బంద్ చేస్తామని తేల్చి చెప్పారు. 

మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ హిందూ పండుగలను తొక్కిపెట్టే ప్రయత్నమేనని హాట్ కామెంట్స్ చేశారు. కేసులు పెట్టనివ్వండి.. ఏమైనా చేసుకోనివ్వండని.. మేము మాత్రం యథావిధిగా మా ఉత్సవాలు చేసుకుంటామని స్పష్టం చేశారు. నేను 2010 నుంచి శ్రీరామ నవమి ర్యాలీలు నిర్వహిస్తున్నా.. కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదని గుర్తు చేసిన రాజాసింగ్.. శ్రీరామ నవమి ర్యాలీలో తప్పకుండా డీజే పెడ్తామని తేల్చి చెప్పారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ భీమ్ సింగ్ గుండెపోటుతో మృతి..

తెలంగాణ వార్త:: సీనియర్ కంటి వైద్యుడు డాక్టర్‌ భీంసింగ్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన...

జనరల్

సబ్ రిజిస్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తే క్షమించేది లేదు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి పై దస్తావేజులు, రియల్ ఎస్టేట్...

జనరల్

బాసర డిఎస్పీగా దువ్వాళ రాజేష్ పదవి బాధ్యతలు..

హైదరాబాద్, తెలంగాణ వార్త (మోహన్ సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్)హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో బాధ్యతలు...

You cannot copy content of this page