తెలంగాణ వార్త::రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి డబ్బులు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చచేసినట్లు సమాచారం కాగా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Leave a comment