Home జనరల్ ఘనంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
జనరల్

ఘనంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

-జీవన్ రెడ్డి నివాసంలో బంధు, మిత్రులు, అభిమానులు, బీఆర్ ఎస్ శ్రేణుల కోలాహలం

-అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపిన అభిమాన గణం

-కులాలు,మతాలు తేడా లేకుండా క్రిక్కిరిసిన జీవనన్న నివాసం

-జీవన్ రెడ్డి క్షేమాన్ని ఆకాంశిస్తూ సర్వమత ప్రార్ధనలు

-నా జీవితం ఆర్మూర్ ప్రజలకే అంకితం

-గౌరవ సీఎం కేసీఆర్ గారి బాటలో నడుస్తా

-జనం సేవకు పునరంకితమవుతా

-జీవన్ రెడ్డి భావోద్వేగం

ఆర్మూర్, మార్చి7,:- (తెలంగాణ వార్త)

పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
బంధు, మిత్రులు, అభిమానులు, బీఆర్ ఎస్ శ్రేణుల హాల్ చల్ తో ఆర్మూర్-అంకాపూర్ లోని జీవన్ రెడ్డి నివాసంలో కోలాహలం నెలకొంది.
జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ అంకపూర్ గ్రామం నుంచి ఆర్మూర్ బీఆర్ఎస్ యువకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి సభ ప్రాంగణానికి చేరుకున్నారు.టపాసులు పేలుస్తూ.. లాంగ్ లివ్ జీవనన్న.. జై కేసీఆర్ .. దేశ్ కీ నేత కేసీఆర్.. జైజై జీవనన్న నినాదాలతో బీఆర్ ఎస్ యువ జనం బాజా బజంత్రీ లు, డప్పు చప్పులతో సందడి చేస్తూ జీవన్ రెడ్డి కి స్వాగతం పలికారు.
ఇదే సమయంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అభిమానుల మధ్య జీవన్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి తన బర్త్ డే వేడుకలను తనకిష్టమైన వారి ఆశీస్సుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అభిమానులు జీవన్ రెడ్డి ని గజ మాలలతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల పెద్దలు,కుల సంఘ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జీవన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆర్మూర్ నుండి అంకపూర్ వరకు జనాల తాకిడికి రోడ్లు జనసంద్రంగా మారాయి. ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వద్దకు డప్పు చప్పులతో వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు…
తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలపడానికి అభిమాన గణం పోటెత్తింది.కులాలు,మతాలు తేడా లేకుండా వచ్చిన ప్రజలతో జీవనన్న నివాసం క్రిక్కిరిసింది
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి క్షేమాన్ని ఆకాంశిస్తూ ఆయన నివాసంలో సర్వమత ప్రార్ధనలు జరిగాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి జీవన్ రెడ్డి కి ఆశీస్సులు అందచేశారు. తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జీవన్ రెడ్డి మాట్లాడుతూ
నా జీవితం ఆర్మూర్ ప్రజలకే అంకితం అని భావోద్రేకానికి గురయ్యారు. గౌరవ సీఎం కేసీఆర్ గారి బాటలో నడుస్తానని, ఆ మహానుభావుడు తనకు దైవ సమానులని, పితృ సమానులని, ఉద్యమంలోనే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధిలోనూ కేసీఆర్ గారి వెన్నంటే ఉంటానని ఆయన ఉద్ఘాటించారు.
నేను 24 గంటలూ జనం సేవకు పునరంకితమవుతానని, నా జీవితం ఆర్మూర్ ప్రజల అనుబంధంతోనే పెనవేసుకొని ఉందని ఆయన అన్నారు. ఇక నుంచి నా రూటే సెపరేట్. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఆశీస్సులు అందించడానికొచ్చిన మీ అందరికీ పాదాభివందనం.. పేరు పేరునా మీకు నా వందనం. మీ ఆశీస్సులతో మరింత కష్టపడి పని చేస్తా. నాకు పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు అందించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, శాసన సబాధి పతి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వేముల ప్రశాంత్ రెడ్డి గారికి,ఎమ్మెల్సీ కవిత గారికి, గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, గౌరవ ఎంపీలు, వివిధ స్థాయిలో ఉన్న గౌరవ ప్రజా ప్రతినిధులు, బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.. మీ బిడ్డను నన్ను ఆశ్వీర్ధించండీ.. అని
జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలావుండగా తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాదాపు 20,000 మందికి పైగా అభిమానులకు భోజనం ఏర్పాటు చేశారు.వచ్చిన వారందరు జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందుని స్వీకరించి ఆశీర్వదించి వెళ్లారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page