గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ లాల్ మృతి..
-అతని కుమారుడని యూరప్ పంపిస్తానని మోసం చేసిన ఏజెంట్ ప్రసాద్…
-డబ్బులు ఇవ్వాలని ఏజెంట్ వద్దకు వెళ్లి మనస్థాపంతో గుండెపోటుతో మృతి…
ఆర్మూర్(తెలంగాణ వార్త – దోండి మోహన్): ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఉంటున్న జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన వాస్తవ్యులు, రిపోర్టర్ రాజేష్ లాల్ (55) గుండెపోటు వచ్చి బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం నమోదయింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ కు మున్సిపల్ పట్టణ కేంద్రంలో నివాసం ఉంటున్న రిపోర్టర్ రాజేష్ లాల్ ఆయన కుమారుడు సృజన్ ని యూరప్ పంపిస్తానని ఓ ఏజెంట్ ను ఆశ్రయించాడు. ఆ ఏజెంట్ యూరప్ పంపకుండా మోసం చేసి కజకిస్తాన్ కు పంపాడు. యూరప్ పంపడం కోసం ఆయన కుమారుడు కోసం 10 లక్షల రూపాయలను ఏజెంట్ ప్రసాద్ కు రిపోర్టర్ రాజేష్ లాల్ అందించాడు. యూరప్ కు పంపిస్తానని ఆయన కుమారుడిని కజకిస్తాన్ కు పంపించడంతో కుమారుడు సృజన్ తిరిగి ఇండియాకు వచ్చాడు. దీంతో మోసం చేసిన ఏజెంట్ ప్రసాద్ ను తిరిగి డబ్బులు ఇవ్వాలని బుధవారం రిపోర్టర్ రాజేష్ లాల్ అడిగాడు. ఆ ఏజెంట్ స్పందించకపోవడంతో రిపోర్టర్ రాజేష్ లాల్ మనస్థాపానికి గురై గుండెపోటుతో బుధవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో మృతులు రాజేష్ లాల్ కుటుంబ సభ్యులు సన్నిహితులు గల్ఫ్ ఏజెంట్ ప్రసాద్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
గల్ఫ్ ఏజెంట్ ప్రసాదం ఇంటి ముందు రాజేష్ లాల్ మృతదేహం తో ధర్నా చేస్తున్న ఇంటి సభ్యులు.
Leave a comment