Home జనరల్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పంను ఏర్పాటు చేసిన డా: రవీందర్ యాదవ్*
జనరల్

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పంను ఏర్పాటు చేసిన డా: రవీందర్ యాదవ్*

*పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్*

*ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పంను ఏర్పాటు చేసిన రవీందర్ యాదవ్*

ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు

కళాకారులతో కలిసి రవీందర్ యాదవ్ బర్త్ డే వేడుకలు నిర్వహణ

వారికి నూతన వస్త్రాలను అందించిన రవీందర్ యాదవ్

పర్యాటకులను ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్

ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానంతో స్వయంగా పూరీ వెళ్లి సంబరాలు

స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న డ్రోన్ వీడియో

తెలంగాణ వార్త::పూరీలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లికి చెందిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా ఒడిశా కళాకారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పూరీ సముద్రం చెంద రూపుదిద్దిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది. సైకత శిల్పంలో కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ అని అందులో పేర్కొన్నారు. అచ్చం ఎమ్మెల్సీ కవితలా రూపుదిద్దిన సైకత శిల్పం చెంత కళాకారులతో కలిసి భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఎమ్మెల్సీ కవిత బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. పలువురు కళాకారులకు నూతన వస్త్రాలను అందజేశారు. వారితో కలిసి శుభాకాంక్షలను తెలుపుతూ వీడియోను రూపుదిద్దారు. డ్రోన్ తో సైకత శిల్పాన్ని, కళాకారుల నృత్యాలను చిత్రీకరించారు. బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని రవీందర్ యాదవ్ చాటుకున్నారు. హైదరాబాద్ లోనూ పలు చోట్ల బర్త్ డే వేడుకలను రవీందర్ యాదవ్ అనుచరులు నిర్వహించారు. రాణిరుద్రమ లాంటి రాజసం ఎమ్మెల్సీ కవితదని ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలి దశలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. తెలంగాణ బతుకమ్మను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని స్పష్టం చేశారు. నాడు ఎంపీగా, నేడు ఎమ్మెల్సీగా రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం నిరంతరం తపిస్తారన్నారు. ఆపద వస్తే ముందుండే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని రవీందర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ అడుగు జాడలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయగా రాణిస్తున్నారని స్పష్టం చేశారు.

mohan 9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page