నిజామాబాద్, తెలంగాణ వార్త: శుక్రవారం నిజామాబాద్ కు బదిలీపై వచ్చి నూతన జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు రాజీవ్ గాంధీ హనుమంతు IAS గారిని కలిసి జిల్లాకు స్వాగతం తెలిపి పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలపడం జరిగింది. జిల్లాలో జరుగుతున్న అట్రాసిటీల మీద మరియు ఇతయా విద్యార్థుల సమస్యల మీద ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యశోదక్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు RMBKS CEC సభ్యులు బట్టి చెన్నయ్య గారు,మాజీ కౌన్సిలర్ రాజమల్లన్న, BVM రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ బట్టు, SMS రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి, జిల్లా నాయకులు సాయికుమార్, పవన్, వీణ తదితరులు పాల్గొనడం జరిగింది.
Leave a comment