Home జనరల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి…..
జనరల్

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి…..


ఆర్మూర్, తెలంగాణ వార్త :: ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రo ఆధ్వర్యంలో శనివారం జ్వర సర్వే నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంను దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గంగ దినేష్ పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు,పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ,చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు.దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి,దోమల నివారణ గురించి,ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సంతోష్,తిరుమల,సుజాత, బ్రీడింగ్ చెక్కర్స్ నరేందర్, రఫిక్,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page