Home జనరల్ ఎల్ఐ.సి లో నూతనంగా 5కోట్ల పాలసీ.
జనరల్

ఎల్ఐ.సి లో నూతనంగా 5కోట్ల పాలసీ.

తెలంగాణ వార్త: భారత ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) కొత్తగా నాలుగు పాలసీలను ప్రవేశపెట్టింది. యూత్‌ను ఉద్దేశించి తీసుకొచ్చిన ఈ పాలసీలు టర్మ్, క్రెడిట్ లైఫ్‌కు సంబంధించినవని, భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినవని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. టీనేజ్‌లో ఉండగానే ఈ టర్మ్ పాలసీలను కట్టొచ్చని, ఆపద సమయంలో జీవిత బీమాగా ఉపయోగపడతాయని ఒక ప్రకటనలో తెలిపింది. యువ టర్మ్ పాలసీ, డిజి టర్మ్ పాలసీ, యువ క్రెడిట్ లైఫ్, యువ డిజి క్రెడిట్ లైఫ్ పాలసీల పేరుతో ఉండే ఈ నాలుగూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నాలుగు పాలసీలు 18-45 ఏండ్ల వయసువారిని ఉద్దేశించి ప్రవేశపెట్టినవని, నెలవారీ/క్వార్టర్లీ/వార్షిక పద్ధతిలో ప్రీమియం చెల్లిస్తే దురదృష్టవశాత్తూ పాలసీ మధ్యలోనే చనిపోతే వారికి మొత్తం బీమా అమౌంట్‌ అందుతుందని తెలిపింది. పాలసీని కట్టిన తర్వాత ఎంత వయసు వచ్చినా అది లైవ్‌లోనే ఉంటుందని, రూ. 50 లక్షల మొదలు గరిష్టంగా రూ. 5 కోట్ల వరకు ఈ పాలసీ వర్తిస్తుందని పేర్కొన్నది

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page