ఆర్మూర్ ఏసిపి రఘు గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు..
ఆర్మూర్ (తెలంగాణ వార్త): ఆర్మూర్ ఏసీపీ రఘు గారి జన్మదిన వేడుకలను ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సోమవారం జరుపుకున్నారు. అనంతరం ఏసీపీ కార్యాలయానికి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు చేరుకొని ఏసీపి రఘు గారికి బర్త్డే విషెస్ చెప్తూ మిఠాయిలు తినిపించారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టి మురళి మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అతనిపై ఉండాలని మీడియా ద్వారా తెలియజేశారు. అనంతరం ఏసీపి రఘు సార్ మాట్లాడుతూ.. జర్నలిస్టు మిత్రులు కలిసికట్టుగా విచ్చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పారు. కార్యాలయంలో ఏసీపి గారితో పాటు జర్నలిస్టులు తేనీటి విందు స్వీకరించారు.
ఈ జన్మదిన వేడుక కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సభ్యులు పాల్గొన్నారు.
Leave a comment