*తెలంగాణ వార్త*
హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో ఏసీబీ దాడులు ఆర్మూర్ పట్టణంలోని అధికారులకు నిద్ర పోకుండా చేస్తున్న ఏసీబీ రైడ్సెఆర్మూర్ పట్టణంలోని అధికారులు లంచం తీసుకుంటున్నారని తెలుసుకుంటున ఏసీబీ అధికారులు వెంటనే దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో రెండు నెలలు వ్యవధిలో ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్న సంగతి విధితమే. అయితే ఈ దాడులు ఎవరైనా చేయిస్తున్నారా లేక ప్రజలే ఇబ్బందులు ఎదుర్కొని అధికారులపై ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి పట్టిస్తున్నారా అన్నది సందేహమే? ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యేగా బిజెపి కి చెందిన పైడి రాకేష్ రెడ్డి ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఇటు వినయ్ రెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఉండగా కాంగ్రెస్ నాయకులు అటు బిజెపి నాయకులు అధికారులను బెదిరిస్తున్నట్టు సమాచారం. బీజేపీ వారు చెప్పిన పని చేయకపోతే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడం ఇటు కాంగ్రెస్ నాయకులు అధికారులకు బెదిరించి పనులు చేయించుకోవడం ఒక వంతు అయితే తమకు చెప్పకుండా అధికారి ఎలా చేస్తాడని ఒకరినొకరు అధికారుల వద్ద పంచాయతీలు పెడుతున్నట్టు తెలిసింది. బిజెపి ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య అధికారులు బలి అవుతున్నట్టు విశ్వాసనీయ సమాచారం. అభివృద్ధి చేయడానికి గెలిచిన నాయకుడు ఆర్మూర్ పట్టణంలో అభివృద్ధి కుంటుపడగా దానిపై కన్నేసి కూడా చూడనట్టు ఉంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్నది తమ పనులు త్వరితంగా జరగాలని బిజెపి నాయకుని ఎన్నుకొనగా ఆయన మాత్రం ప్రజలు చూడడానికి టీవీలో కనిపిస్తూ అసెంబ్లీలో నిలదీసినట్టు మాట్లాడుతూ కనబడుతున్నాడు. దీనిని టీవీలో ప్రజలు చూసి ఆహా ఓహో అనుకోవడంలో సందేహం లేదు. తమ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆర్మూర్ పట్టణం కోసం గట్టిగా మాట్లాడుతున్నారని అనుకోవడం తప్ప ఇక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు . ఇక నాయకులు తమ పర్సెంటేజీల కోసం బిజెపి కాంగ్రెస్ చోటామోటా నాయకులు ఇండ్లు కట్టే వారి వద్ద అభివృద్ధి జరిగే చోట వెళ్లి ఫోటోలు తీస్తూ తమకు ఇంత ఇవ్వాలని వారి వద్దకు వెళ్లి డిమాండ్ చేస్తున్నట్టు గతంలో వెళ్లడైంది. అయితే నాయకుడు తీసుకుంటున్నా పర్సంటేజీ లంచం కాదా అని ఆర్మూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఇటు కాంగ్రెస్ అటు బిజెపి లీడర్ల పట్ల ఆర్మూర్ ప్రజలు విసుగెత్తి పోయి అధికారులు లంచం తీసుకుంటే ఏసీబీ వారితో ఎలా పట్టిస్తున్నారో అలాగే నాయకులు లంచం తీసుకుంటే వారిని కూడా పోలీసులకు పట్టియాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ నాయకులు చేస్తే సంసారమా అదే పని అధికారులు చేస్తే వ్యభిచారమా అని ఆర్మూర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎది ఏమైనాప్పటికీ ఇప్పటివరకు ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులకు పట్టించి ఆర్మూర్ మున్సిపల్ పట్టణానికి అభివృద్ధి కుంటుపడుతుంది అనడంలో సందేహం లేదు. *మరో ఉన్నత అధికారిపై ఏసీబీ డేగ కన్ను* ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలో గల మరో ఉన్నత అధికారిపై ఏసీబీ అధికారులు పనిగట్టుకుని ఆధికారిని రెడ్ హ్యాండెడ్ గా వలవేసి పట్టుకునేలా ఆర్మూర్లో వ్యవహారం జరుగుతుంది. ఇంతకీ ఎప్పుడు లేనంత గా ఆర్మూర్లో ఎసిబి దాడులు జరగడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని విశ్వసనీయ సమాచారం. తాను చెప్పినట్టు అధికారులు వినకపోవడమే దీనికి కారణం అని తెలుస్తుంది. దీనిపై అధికారులు తలలు పట్టుకొని ఎన్నికలు కాగానే ఆర్మూర్ నుండి బదిలీపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. రాజకీయ నాయకుల కు ఇప్పుడు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు జవాబు చెప్తా మని గ్రామ ప్రజలు అంటున్నారు.
Leave a comment