నిజామాబాద్, రుద్రూర్ ,తెలంగాణ వార్త: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లో జోరుగా మొరం తవ్వకాలు ప్రతిరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా సీసీ కెమెరా సాక్షిగా అధిక లోడుతో టిప్పర్ల ద్వారా వెళ్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం
ఇంత దారుణంగా మొరం తవ్వకాలు గుట్టలు మాయమవుతున్న సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
ఓవైపు మామూళ్ల మత్తులో మునుగుతున్న రా?
లేక బడాబాబుల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నా రా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి
అర్ధరాత్రి జోరుగా మొరం తవ్వకాలు రవాణా గుండ లాగా చేస్తున్నారని దీనికి సీసీ కెమెరాలు సాక్షిగా ఉన్నప్పటికీ
ఎవరైనా విలేకరులు న్యూస్ కవరేజ్ కోసం వెళ్తే వారిపై దాడులకు దిగి ఫోన్ లాక్కున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి
ఇంత దర్జాగా త్రవ్వకాలు రవాణా అమ్మకాలు దొంగలించడం వంటివి పగలు రాత్రి అనే తేడా లేకుండా చేస్తుంటే వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తుంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం దొంగలను దొర గా చూడటం సిగ్గుచేటని పలువురు మండిపడుతున్నారు
ఇలాంటి వారిపై ఎలాంటి కేసులు చెయ్యనివారు అమాయక ప్రజలపై కేసులు చేసి రౌడీషీట్లు చేస్తున్నవారికి
ఎక్కడి ధర్మం ఎక్కడి న్యాయం అని పలువురు ప్రశ్నిస్తున్నారు మరి ప్రజలకు అధికారులు ఏ విధమైన జవాబులు ఇస్తారో వేచి చూడాల్సిందే మరి
Leave a comment