Home జనరల్ అధికార పార్టీకి అసమ్మతి సెగ పార్టీ వీడిన బి ఆర్ ఎస్ క్యాడర్…
జనరల్

అధికార పార్టీకి అసమ్మతి సెగ పార్టీ వీడిన బి ఆర్ ఎస్ క్యాడర్…

టిఆర్ఎస్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి నిరసనగా

  • ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాజీనామా చేసినట్లుగా వెల్లడి
  • పాతిక మందికి పైగా ప్రతినిధులు, భారీ సంఖ్యలో అనుచరులు ముకుమ్మడి రాజీనామాలు
  • ఎన్నికల్లో ఎమ్మెల్యేను ఓడించి తీరేందుకు శపథం

ముధోల్, తెలంగాణ వార్త ; అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముథోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సోమవారం పార్టీ అసమ్మతి వర్గం మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసింది. ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి తీరును నిరసిస్తూ తామందరం పార్టీని వీడుతున్నట్లుగా అసమ్మతి వర్గం పేర్కొంది. స్థానిక శ్రీ బంకేట్ హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించి రాజీనామా విషయాన్ని అసమ్మతి ప్రతినిధులు భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు, పార్టీ ప్రతినిధులు సౌంవ్లీ రమేష్, సోలంకే భీంరావులు వెల్లడించారు. పార్టీ అధిష్ఠానానికి పలు దఫాలుగా, వివిధ రీతుల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పని తీరుపై ఫిర్యాదులు చేపట్టిన అధిష్ఠానం ఆయనకే అసెంబ్లీ టికెట్ కేటాయించడం అసంతృప్తికి గురి చేసిందన్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే ముథోల్ అసెంబ్లీ స్థానాన్ని పార్టీ కొల్పోవాల్సి వస్తుందని అధిష్ఠానానికి నివేదించిన స్పందన కరువైందన్నారు. ఈ కారణాల మూలంగానే తామందరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఓడించి తీరుతామని శపథం చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ రాజేష్ బాబు, బాసర ఎంపీపీ సునిత విశ్వనాథ్ పటేల్, జడ్పీటీసీ సభ్యురాలు వసంత రమేష్, భైంసా జడ్పీటీసీ సభ్యురాలు దీపా భీంరావు పటేల్ సొలాంకే, ముథోల్ నియోజకవర్గ జాతృతి సమితి అధ్యక్షులు పండిత్ రావు పటేల్లు ఉన్నారు. వీరితో పాటు భైంసా, లోకేశ్వరం, ముథోల్ మాజీ జడ్పీటీసీ సభ్యురాళ్లు, నీలాబాయి రాంకిషన్ పటేల్, శోభా సురేష్, ప్రమీలా రాజేశ్వర్, పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ప్రతినిధులతో పాటు వారి అనుచరగణం సైతం భారీ సంఖ్యలో పార్టీని వీడారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page