ఆర్మూర్ మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి🙏…
ఆర్మూర్, తెలంగాణ వార్త;:: ఆర్మూర్ మండల ప్రజలకు, గణేష్ ఉత్సవ కమిటీలకు, సర్పంచ్ గార్లకు, కౌన్సిలర్ లకు, ప్రజా ప్రతినిధులకు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు,సభ్యులకు, అన్ని మతాల పెద్దలకు, భజరంగ్ దల్ , గోరక్షక్ వారికి ,కమిటీ చైర్మన్ లకు, కుల సంఘాల అధ్యక్షులకు,యువజన సంఘాలకు, యువకులకు, మండల మైనార్టీ కమిటీ కి, మండల,పట్టణ మైనార్టీ నాయకులకు, అన్ని పార్టీల ముఖ్య నాయకులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పత్రిక మిత్రులకు,… ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా…. ఈ నెల 31/08/2022 నాడు గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుచున్నవి కావున ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు అందరి సహకారం ఎంతైనా ఉండాలి కాబట్టి ఏ మత పండగ అయినా కులమతాలకతీతంగా మనమందరం ప్రతి పండగను కలిసి మెలిసి ఇదివరకు చేసుకున్నట్టే ఇప్పుడు కూడా శాంతియుత వాతావరణం లో పండగను చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్మూర్ పోలీస్ వారు ACP ఆర్మూర్ R. ప్రభాకర్ రావు గారి అధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం ఈ రోజు సాయంత్రము 0400 గంటలకు SSK ఫంక్షన్ హాల్ హౌసింగ్ బోర్డు నందు నిర్వహించబడును. కావున మతసామరస్యానికి కృషి చేయడానికి ఈ సమావేశానికి అందరూ హాజరుకావాలని ఆర్మూర్ పోలీసు వారి విజ్ఞప్తి.
💐💐💐
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఆర్మూర్ పోలీస్ స్టేషన్..
Leave a comment