నందిపేట్, తెలంగాణ వార్త:: లక్కంపల్లి గ్రామ శివారులో గురువారం కృష్ణ జింకను కుక్కలు తీవ్రంగా దాడి చేయగా కుక్కల బారినుండి తప్పించుకొనే ప్రయత్నంలో అత్యంత వేగంగా పరగెత్తడం వలన శ్వాస తీసుకోవడం ఇబ్బంది జరిగి మరణించడం జరిగింది (కార్డియ్యక్ ఫెల్యూర్ )ఇట్టి సమాచారాన్ని వెంటనే లక్కంపల్లి యూత్ సభ్యులు స్థానిక నందిపేట్ మండల డిప్యూటీ అటవీ అధికారి సుధాకర్ గారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఘటన స్థలానికి స్థానిక వెటర్నరీ డాక్టర్ ను తీసుకొని పోస్ట్ మార్టం నిర్వహించగా కుక్కల దాడిలో చనిపోయిందని తన నివేదికలో నిర్దారణ చేయడం జరిగింది..ఇట్టి విషయాన్నీ సకాలంలో తెలిజేసిన లక్కంపల్లి యువకుల్ని మండల డిప్యూటీ అధికారి సుధాకర్ గారు అభినందించడం జరిగింది…ఇందులో లక్కంపల్లి సాగర్, సుదర్శన్, కుర్మ పోతన్న, లక్ష్మణ్, వికాస్, అభిలాష్, కాళోజి తదితరులు పాల్గొన్నారు.
Leave a comment