Income Tax: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోదీ ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజల కోసం ఎన్నో టాక్స్ బెనిఫిట్స్ అందిస్తోందని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కొత్త పన్ను విధానంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వార్త ::Income Tax: కేంద్ర ప్రభుత్వం పన్నుల పరంగా మధ్యతరగతి ప్రజలకు/వర్గాలకు పలు రకాల ప్రయోజనాలు కల్పించిందని అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. కొత్త పన్ను విధానం ప్రకారం.. ప్రస్తుతం రూ.7.27 లక్షల వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. వార్షికంగా రూ. 7.27 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా మోదీ ప్రభుత్వం చేసిన సంస్కరణల్లో ఒకటని గుర్తు చేశారు. ఇక ఇదే సమయంలో ఈ కొత్త పన్ను విధానంపై మరింత స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు.
12023-24 బడ్డెట్ సమయంలో రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉంటే.. పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించిన సమయంలో ఆ పరిమితికి మించి కాస్తంత ఎక్కువ సంపాదిస్తున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ అంశం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపిన నిర్మలమ్మ.. రూ. 7 లక్షలకు మించి ఆర్జించే ప్రతి రూపాయిపైనా పన్ను ఏ స్థాయి నుంచి కట్టాల్సి ఉంటుందనే అంశంపై తమ బృందం మళ్లీ కసరత్తులు చేసిందని వివరించారు.
దీనిని బట్టి ప్రస్తుతం రూ.7.27 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని.. ఆ తర్వాత సంపదపై టాక్స్ పడుతుందని చెప్పారు. ఇక కొత్త స్కీంలో స్టాండర్డ్ డిడక్షన్ లేదని ఫిర్యాదులు వచ్చిన క్రమంలో దీనిని కూడా చేర్చినట్లు చెప్పుకొచ్చారు.
ఇంకా కొత్త పన్ను విధానంలో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా అనుమతించారు నిర్మలా సీతారామన్. తొలుత లేదని.. ఆ తర్వాత దీని గురించి చర్చలు జరిగాయని వివరించారు. దీంతో కొత్త పన్ను విధానం వల్ల రూ. 7 లక్షల వరకు వార్షికాదాయంపై రూ.33800, రూ. 10 లక్షల ఆదాయంపై రూ.23,400; అదే విధంగా రూ.15 లక్షల ఆదాయంపై రూ.49,400 ఆదా అవుతుంది.
Leave a comment