Home జనరల్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లంబాడీలకు భోజనం వడ్డించిన మంత్రి….
జనరల్

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లంబాడీలకు భోజనం వడ్డించిన మంత్రి….

రంగారెడ్డి జిల్లా (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవర్గం ఉప్పుగడ్డ తండాలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ గిరిజనోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. గిరిజన జీవితాల్లో గణనీయమైన మార్పు కోరుతూ వారి ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి, గిరిజన జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ గిరిజన బాంధవుడుగా గిరిజనుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారని స్పష్టం చేశారు.
తొమ్మిదేళ్ళ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని మననం చేసుకునేందుకు ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం, కుమ్రంభీం జయంతి, సేవాలాల్ మహారాజ్ జయంతి, సమ్మక్క సారక్క జాతర, అందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును, వివిధ జాతరలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయం, తదితర వివరాలను వెల్లడించారు.

గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, వాటిని అవగాహన చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తండాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతీ 500 జనాభా గల తండాలను గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. గిరిజన గ్రామాలలో రోడ్డు, మురికి కాల్వలు, వీధి లైట్లు, వైకుంఠ దామాలు, క్రీడా ప్రాంగణాలు వంటివి , మాలిక వసతులు కల్పించడం జరిగిందని మంత్రి వివరించారు. సేవాలాల్ జయంతి, గిరిజన సంస్కృతిని వివరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడిన పంచాయితీలకు భవనాలు నిర్మాణం కోసం ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.
గిరిజన ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయకుండా వారు కోరిన విధంగా ఉచిత విద్యను ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అందిస్తున్నారని, భోజనం, పుస్తకాలు, బట్టలు, ఉపకార వేతనాలు, తదితర వస్తువులు సమకూర్చడం జరుగుతున్నదని, వాటిని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలకు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఆశ, ఏ.ఎన్.ఎంలు ఇంటింటికి వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రభుత్వ సంకల్పానికి తోడ్పాటు అందించి సహకరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని గిరిజనులకు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతంకు పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాల ద్వారా గణనీయమైన మార్పుకు నాంది పలికారని అన్నారు. ఈ విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా గిరిజనుల సమగ్ర వికాసానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ‘ న భూతో న భవిష్యతి ‘ అన్న రీతిగా ఉందన్నారు. గిరిజనోత్సవాల్లో గిరిజనుల అభివృద్ధి, అందుతున్న సంక్షేమ ఫలాలు రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా గిరిజన ఉత్సవాలను గ్రామీణ ప్రాంతంలో నుండి రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి అన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల గిరిజన తండాల నుండి 3146 గిరిజన గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకు రావడంతో పాటు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్లు కల్పించిన విప్లవాత్మక ఘనత తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రిదే అని అన్నారు. గడచిన తొమ్మిదేళ్ళ కాలంలో గిరిజనాభ్యూదయానికి 53 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, త్రాగునీరు, సాగునీరు సదుపాయాలు కల్పించడం జరిగింది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ మేయర్ దుర్గా దీప్లా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, స్థానిక సర్పంచులు, ఎంపీపీలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page