Home జనరల్ 33 వ వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు…
జనరల్

33 వ వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు…

ఆర్మూర్ ,తెలంగాణ వార్త:: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సహా కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో పర్యటించి బిజెపి కార్యకర్తలతో సభ్యత్వ నమోదును జోరుగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డులో బిజెపి నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు మద్దతుగా నిలవాలని ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి షికారి శ్రీనివాస్, బూత్ అధ్యక్షుడు దక్షిణామూర్తి, మీసాల రాజేశ్వర్, పీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

జనరల్

ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు...

You cannot copy content of this page