Home జనరల్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…
జనరల్

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్

తెలంగాణ తల్లిని, ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానించింది

ప్రజా పాలన అంటే ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడమా..?

రేవంత్ రెడ్డిది నియంత పాలన.. కేసీఆర్ అభివృద్ధి చేస్తే దాన్ని నాశనం చేస్తుండు

సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం

కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా..

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్

తెలంగాణ వార్త, హైదరాబాద్ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేసి విద్యార్థుల బలిదానాలను తీసుకున్న కాంగ్రెస్ పార్టీని చరిత్ర మరవదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాబీ షేకాలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను నెంబర్ గా అభివృద్ధి చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దివాళ తీయించేలా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయకుండా రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీకి గులాంలు చేస్తూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడమేనని కాంగ్రెస్ పార్టీ కొత్త అర్ధాన్ని చెబుతుందని విమర్శలు గుప్పించారు.

ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ తో పాటు శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మారబోయిన రవి యాదవ్ నర్సింహా రెడ్డి సాయి చందర్ శ్రీకాంత్ యాదవ్ మల్లేష్ గౌడ్ శ్రీశెలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

జనరల్

అధికారులను భయపెట్టడానికా!

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలో గత వారం రోజుల నుంచి ఆర్మూర్ మండలం ప్రభుత్వ అధికారులను...

You cannot copy content of this page