Home జనరల్ శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..
జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు

పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు

అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ కవితను కలిసిన రవీందర్ యాదవ్

జన్మదినం సందర్భంగా పూరీ తీరాన సైకత శిల్పం ఏర్పాటు

సైకత శిల్పం ఫోటో ఫ్రేమ్ అందజేసిన రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లిలో పార్టీని ముందుండి నడిపించాలని సూచన

స్థానిక కార్యకర్తలకు అండగా ఉంటాం..

కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తాం -రవీందర్ యాదవ్

తెలంగాణ వార్త::భారాస ఎమ్మెల్సీ కవితను సీనియర్ నేత రవీందర్ యాదవ్ తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కవిత జన్మదినం సందర్భంగా ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించిన రవీందర్ యాదవ్.. కళాకారులతో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కళాకారులకు, సైకత శిల్పం రూపుదిద్దిన వారికి నూతన వస్త్రాలను అందించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినంను స్వయంగా రవీందర్ యాదవ్ పూరీ తీరాన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత అడిగి తెలుసుకున్నారు. పూరీ జగన్నాథ్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రసాదాన్ని కవితకు రవీందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో ముందుంటున్నారని రవీందర్ యాదవ్ ను కొనియాడారు. శేరిలింగంపల్లిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో భారాస అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేస్తుందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రవీందర్ యాదవ్ వెల్లడించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

You cannot copy content of this page