ధోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్
తెలంగాణ వార్త:: గురువారం సాయంత్రం సుమారు 5 గంటలు సమయంలో, ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ భవనం వెనుక ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. వేసవి కాలం కారణంగా, పోలీస్ స్టేషన్ భవనానికి కొంత దూరంలో ఉన్న పొదల్లో అనుకోకుండా మంటలు చెలరేగినట్లు తెలుసుకొని ఘటన స్థలాన్ని సందర్శించగా. పోలీస్ స్టేషన్ భవనం వెనుక భాగంలో పార్క్ చేసి ఉన్న సుమారు 10 వాడుకలో లేని (అబాండన్ చేసిన) వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఇంకా పూర్తి సమాచారం తెలియవలసి ఉందని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ తెలిపారు.


Leave a comment