నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట్ మండల కేంద్రంలోని పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుని గా ఎన్నికైన ఆహ్మద్ ఖాన్ ను టి ఆర్ ఎస్ మైనారిటీ సెల్ ఆర్ముర్ నాయకులు శనివారం శాలువ, పూల మాలతో సన్మానించారు. ఇటీవల నందిపేట్ గ్రామం లోని అన్ని మజీద్ సభ్యుల సమక్షంలో ఎన్నికలు జరిపి నూతన కార్యవర్గాన్ని మరియు అధ్యక్షునిగా ఆహ్మద్ ఖాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .
ఈ సందర్బంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉస్మాన్ హజ్రమీ మాట్లాడుతూ మాజీ ఎంపిటిసి అహ్మద్ ఖాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నందిపేట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహాయ సహకారాలతో నందిపేట్ ముస్లిం కమిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని టి ఆర్ ఎస్ యాక్టివ్ లీడర్ సుమీర్ అహ్మద్ వాగ్దానం చేశారు.
ఇట్టి కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, ముస్లిం కమిటీ కార్యదర్శి హుస్నోద్దీన్, మండల ముస్లిం కమిటీ ఫౌండర్ షేక్ గౌస్, జమే మజీద్ కార్యదర్శి నసీర్, సహయ కార్యదర్శి ఇఫ్టేఖరు వార్డు సభ్యుడు రఫిక్ ఖాన్ తదితరులు ఉన్నారు.
Leave a comment