Home జనరల్ పర్యావరణ పరిరక్షణ_ పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయం… మంగి రాములు మహారాజ్..
జనరల్

పర్యావరణ పరిరక్షణ_ పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయం… మంగి రాములు మహారాజ్..

నందిపేట్, తెలంగాణ వార్త:పర్యావరణ పరిరక్షణ_ పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయంగా ఆశ్రమం కృషి చేస్తున్నదని నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ పేర్కొన్నారు. ఆశ్రమ సభ్యులతో కలిసి శనివారం ఆశ్రమ హాల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులపై వివరణ ఇస్తూ తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈశ్వరుని కృపా కటాక్షంతో గత 37 సంవత్సరాలుగా ఆశ్రమంలో ఆధ్యాత్మిక , సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన పలుగుట్టపై పూర్వకాలం నుంచి పలువురు రైతులకు పట్టా ఉండడంతో వారంతా ఇట్టి భూమిని ఇతరులకు అమ్మేందకు సిద్ధమవటంతో భక్తుల సూచన, సహకారంతో భూమిని కొనుగోలు చేశామని తెలిపారు.
మొరం గుత్తేదారులు కొంటే గుట్టను తొలగించే ప్రమాదం ఉంటుంది అని ముందు చూపుతో ఆశ్రమం కొనుగోలు చేసిందని తెలిపారు, ప్రస్తుతం గుట్ట పైన ఉన్న కొన్ని పిచ్చి మొక్కలను మాత్రమే తొలగిస్తున్నామని, ఎలాంటి పెద్ద వృక్షాలు నరక లేదని , పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహలను నమ్మవద్దని కోరారు. వ్యాపారం చేసేందుకు భూమిని కొనుగోలు చేయలేదని పలుగుట్టను కాపాడేందుకే కొనుగోలు చేశామన్నారు. ఇట్టి భూమి లో గంధం చెట్లు, వివిధ రకాల అయోర్వేదా మందుల మొక్కలు నాటడమే కాకుండ గోవుల మేత కొరకు భూమిని ఉంచి ఆశ్రమాన్ని మరింత ఆహ్లాదకరమైన విధంగా అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచర్ల సాగర్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఆశ్రమ కమిటీ సభ్యులు బంగారు సాయి రెడ్డి, బుక నారాయణ ,అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి, రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ రైతు మృతి..

ఆలూర్, తెలంగాణ వార్త:. ఆలూరు మండలం మచ్చర్ల శివారులో మంగళవారం సాయంత్రం స్తంభాన్ని బైక్‌ ఢీకొన్న...

జనరల్

ఆర్మూర్ ఏఎస్ఐ ల బదిలీ.. జిల్లాలోనే భారీ బదిలీలు….

ఆర్మూర్, తెలంగాణ వార్త:: నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు ఏఎస్ఐ అధికారులు బదిలీ కాగా వారిలో ఆర్మూర్...

జనరల్

రవీందర్ యాదవ్ కు కెసిఆర్ ప్రశంసలు. జన్మదిన సందర్భంగా కెసిఆర్ ఆశీస్సులు..

రవీందర్ బాగున్నావా..? మీ కార్యక్రమాలు బాగున్నాయి.. మంచి భవిష్యత్ ఉంది.. ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం...

జనరల్

TUWJ-IJU అదిలాబాద్ కన్వీనర్ గా పి. దేవిదాస్ v6 నియామకం.

అదిలాబాద్, తెలంగాణ వార్త::తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టియుడబ్ల్యుజె – ఐజేయు )...

You cannot copy content of this page