నందిపేట్, తెలంగాణ వార్త::
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన భారతయ జనతా పార్టీ హుజరాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర కాన్వాయి పై టిఆర్ఎస్ పార్టీ కిరాయి గుండాలు అమారుషంగా రాళ్లతో కర్రలతో దాడి చేయడం ఇది హేయమైన చర్య అని బి జె పి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారంపల్లి గంగాధర్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన పత్రిక ప్రకటన చేసారు. మునుగోడులో గత 20 రోజుల నుండి 85 మంది శాసనసభ్యులు మంత్రులు ఎమ్మెల్సీలు అబద్ధం మాటలు పలికి ప్రజలను ఎన్ని విధాల మభ్యపెట్టిన వారి మోసపూరిత మాటలకు ప్రజలు విశ్వసించక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించడానికి సిద్ధమైనరని తెలుసుకొని తెలంగాణ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడి ఎటు తోచక ఇటువంటి ప్రజాస్వామ్య దాడులకు పాల్పడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఇటల రాజేందర్ పై భారతీయ జనతా పార్టీకి ప్రజలలో పెరుగుతున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ చర్యను తన టిఆర్ఎస్ చెందిన కిరాయి గుండాలతో చేయించడం అమానుషం అన్నారు.
దమ్ముంటే ప్రజల సమస్యలు తీర్చి ఓటు వేయించుకోవాలి కానీ దాడులకు పాల్పడితే ప్రజలు దానిని సహించరు అంగీకరించారన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
Leave a comment