బ్రేకింగ్ న్యూస్
విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి తెలంగాణ వార్త
విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి వద్ద, ఓ డాల్ మిల్లు లో ప్రభుత్వ అక్రమ రేషన్ బియ్యం సుమారు 360 బస్తాలు ఏపీ 39 యు సి 4478 నెంబరు గల లారీలో అక్రమంగా రేషన్ బియ్యం అమలాపురం తరలిస్తున్నారని సమాచారం రావడంతో క్షణాల వ్యవధిలో స్పందించిన కొత్తపేట పోలీసులు,ఆ వాహనాన్ని కొత్తూరు తాడేపల్లి వద్ద నుండి వైయస్సార్ కాలనీ జక్కంపూడి పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు తీసుకువచ్చరు, రైస్ మిల్లు యజమాని శ్రీనివాసు,అని అతను మంగళగిరిలో నివాసం ఉంటాడని పోలీసులకు వివరాలు తెలియజేశారు, లారీ నడుపుతున్న డ్రైవర్ సాంబా అతనికి లైసెన్స్ లేదని తెలిసింది, ఈ లారీకి ఎదర నెంబర్ ప్లేట్లు తీసివేసిన రేషన్ మాఫియా. గుంటూరు నుండి అమలాపురం వెళుతుందని పోలీసులకు తెలియజేసిన డాల్మిల్ యజమాని శ్రీనివాస్, ఈ పేదలకు అందవలసిన రేషన్ బియ్యం జయంతి అనే ఊళ్లో ఆక్షన్ లో కొన్నానని మేము వేరే చోటకి అమ్ముకుంటున్నామని,మా దగ్గర బిల్స్ ఉన్నాయి మేము చూపిస్తామని, పొంతన లేని సమాధానాలు డాల్మిల్ యజమాని శ్రీనివాస్ కొత్తపేట పోలీసులకు తెలిపారు.
పిడిఎస్ రైస్ తో పట్టుబడ్డ లారీలో గుంటూరు నుండి ఈ లారీ అమలాపురం వెళుతున్నట్టుగా ఓ నకిలీ బిల్లు తీసుకువచ్చి పోలీసు వారికి చూపించారు, వారి వద్ద నుండి పూర్తి వివరాలు నమోదు చేసి సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించిన కొత్తపేట పోలీసులు.
ఈ రేషన్ మాఫియా తో పాటు ఏపీ 16 డి ఈ7633 నంబరు గల బైక్ పై ఓ వ్యక్తి వచ్చి ఇది రేషన్ బియ్యం మాకు సంబంధించినది మీరు ఎందుకు ఆపుతారు,అని బైక్ పై వచ్చిన వ్యక్తి గట్టిగా ప్రశ్నించాడు, ఆ బైక్ పై పోలీస్ అని రాసి ఉంది, అసలు బైకు ఎవరిది పోలీసులే ఇన్వాల్వ్ అయ్యి రేషన్ మాఫియా కి సహకరిస్తున్నారా అనే మానాలు వ్యక్తమవుతున్నాయి?.
ఏపీ 16 డి ఈ,7633 బైక్ ని సీజ్ చేసి ఈ వాహనంపై పోలీస్ అని ఎందుకు రాసి ఉన్నది, అసలు ఈ వాహనం ఎవరిది, ఈ దిశగా పోలీసులు విచారిస్తారో లేదో వేచి చూడాలి.
దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Leave a comment