- ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు..
ఆర్మూర్( తెలంగాణ వార్త ఆర్.సి) జనవరి27: ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధి పత్రికలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో వాటి పాత్ర కీలకమని ఆర్మూర్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు.
ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ శ్రీనివాసులు తహసిల్దార్ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా ‘ప్రజాజ్యోతి’ తెలుగు దినపత్రిక 2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్మూర్ డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) శ్రీనివాసులు మాట్లాడుతూ.. నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు.
-ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ప్రతి అక్షరం ప్రజల కోసం అనే నినాదంతో వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో ప్రజలకు అందించే కర్తవ్యాన్ని ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక అందిస్తుందని స్పష్టం చేశారు. పాఠకుల, ప్రజల విశేష ఆదరణతో “ప్రజాజ్యోతి” ఇప్పుడు ప్రధాన మీడియా సంస్థల సరసన చేరింది. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని సెక్షన్ల ప్రజలకు చేరువైంది. క్యాలెండర్ ఆవిష్కరణలో అన్నారు. ప్రజా జ్యోతి యాజమాన్యం జిల్లా బ్యూరో బృందం ఆర్మూర్ డివిజన్ పరిధిలో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
-ఆర్మూర్ తాసిల్దార్ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్మూర్ పట్టణంలో ప్రజల సమస్యలను వెలికితీస్తూ ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో, సమ సమాజ స్థాపన లో దినపత్రికల ప్రాధాన్యత ఎంతో ఉందని ‘ప్రజాజ్యోతి’ దినపత్రిక ప్రజల ఆధార అభిమానాలను పొందుతూ పత్రికల రంగంలో రాణించాలని తాసిల్దార్ వేణుగోపాల్ ఆకాంక్షించారు. ఆర్మూర్ పట్టణ ప్రజాజ్యోతి ఆర్.సి రిపోర్టర్ పొన్నాల చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ 2023 ను ఆవిష్కరించారు.ఆర్మూర్ తాసిల్దార్ మాట్లాడుతూ.. ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ప్రజల ఆధార అభిమానులు పొందుతుందన్నారు. ప్రజాజ్యోతి నిజామాబాద్ లోనే అనతి కాలంలోనే మరింత ప్రజలకు చేరువయ్యలా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రజల పక్షాన పని చేస్తున్న ప్రజా జ్యోతి దినపత్రిక జిల్లా బ్యూరో ఎడ్ల సంజీవ్ గారికి అలాగే యాజమాన్యానికి, ఆర్మూర్ డివిజన్ పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాజ్యోతి పాత్రికేయులు పొన్నాల చంద్రశేఖర్ ఆర్.సి, బాల్కొండ పాత్రికేయులు సిరిగిరి వెంకటేష్, ప్రజాతంత్ర విలేకరి మోహన్ బాబు,లింగంపల్లి శివదాస్ పాల్గొన్నారు.
Leave a comment