• రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘట్కేసర్ మున్సిపల్ ఏఈ, వర్క్ ఇన్ స్పెక్టర్ లు.
ఏసీబీ వలలో అవినీతి జలగలు
ACB RAIDS: రూ. 80,000/- వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కి చిక్కిన ఘట్కేసర్ పురపాలక సంస్థ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ సున్ని లను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
హైదరాబాద్, తెలంగాణ వార్త: వినాయక నిమజ్జనం(GANESH IMMERSION) సందర్భంగా క్రేన్(CRANE) లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్(CONTRACTOR) కు బిల్లులు మంజూరు చేసేందుకు రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఘట్ కేసర్ మున్సిపల్ ఏఈ(AE) రాజశేఖర్, వర్క్ ఇన్ స్పెక్టర్ సున్నీ లను ఏసీబీ అధికారులు(ACB OFFICERS) శుక్రవారం రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ రంగారెడ్డి యూనిట్ డీఎస్పీ(DSP) ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఘట్ కేసర్ మున్సిపల్ కాంట్రాక్టర్ శివరాత్రి కుమార్ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా టెండర్ లో పాల్గొని ఎదులాబాద్ లక్ష్మీ నారాయణ చెరువు వద్ద 3 క్రేన్ లను ఏర్పాటు చేశాడు. అందుకు సంబందించిన రూ.10 లక్షల బిల్లులు రావలసి ఉండగా బోడుప్పల్ కార్పోరేషన్ ఏఈ మంగురావు రాజశేఖర్ ప్రస్తుతం ఘట్ కేసర్ మున్సిపల్ ఇంచార్జి ఏఈ గా భాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా మేడే సున్నీలు పలు కారణాలు చెప్తు జాప్యం చేస్తున్నారు.
Leave a comment