నిజామాబాద్, తెలంగాణ వార్త : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏసీపీపై బదిలీ వేటు పడింది. టాస్క్‌ఫోర్స్ విభాగం ఏసీపీ విష్ణుమూర్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ఈయనపై పలు సివిల్ పంచాయితీల్లో తలదూర్చిన, అక్రమ దందాలు నిర్వహించే వారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదికను డీజీపీకి అందజేశారు. అనంతరం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. కాగా.. సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారికి టాస్క్ ఫోర్స్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించారు. సత్వరమే బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని సీపీ కల్మేశ్వర్ మెమో జారీ చేశారు.

Leave a comment