ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆదివారం ఉదయం 6:10 గంటలకు, NH44 లోని రిలయన్స్ పెట్రోల్ పంప్ వద్ద, హైదరాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహన డ్రైవర్, తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపి, ప్యాషన్ ప్రో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడిపిస్తున్న వ్యక్తి పెర్కిట్ అశోక్ రెడ్డి అక్కడికక్కడే మరణించినట్టు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
మృతుడు శ్రీరామ్ అశోక్, (55) ఏళ్లు, పెర్కిట్ గ్రామం నివాసి అని తెలిసింది. అతను వ్యవసాయ పనులకు వెళ్తున్నట్టు తెలిసింది. ప్రాణాలు కోల్పోయిన అతని శవాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Leave a comment