ఆర్మూర్, తెలంగాణ వార్త:: డొంకేశ్వర్ మండలం లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం డొంకేశ్వర్ మండలంలో పర్యటించడం జరిగింది.
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలో లోంక రామన్న గుడి మీదుగా నూతపల్లి వరకు మంజూరైన బీటీ రోడ్డు పనులను ఆయన శంకుస్థాపన చేశారు
ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయించడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు ఇక్కడ విద్యార్థుల తరపున ఆయనకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు మండల అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
Leave a comment