ఆర్మూర్, తెలంగాణ వార్త: నకిలీ ఏజెంట్, అసలు ఏజెంట్ అంటూ ఎవరూ లేరని అందరూ దొంగ ఏజెంట్లేనని సిపిఐ ఎంఎల్ దేవరం పేర్కొన్నారు. డిచ్ పల్లి గ్రామంలో దుబాయ్ పంపిస్తామని మోసం చేసి ఏజెంట్ పారిపోవడం పై ధర్నా చేస్తూ కోటపాటి నరసింహనాయుడు నకిలీ ఏజెంట్ల పై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు విలేకరులకు తెలిపారు. దుబాయ్ పంపే ఏజెంట్లలో అసలు ఏజెంటు నకిలీ ఏజెంటు అంటూ ఎవరూ లేరని అందరూ దొంగలేనని ఈ ఏజెంట్ వ్యవస్థ మారాలని అధికారికంగా ప్రభుత్వ లైసెన్స్ ఉంటేనే ఏజెంట్గా గుర్తింపు ఇవ్వాలని ఆయన కోటపాటి మాట్లాడిన మాటపై స్పందించారు. నకిలీ ఏజెంట్ల బారిన వేలమంది జీతభత్యాల కోసం ఇతర దేశాలకు వెళ్లడానికి నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోయి ఎందరో చచ్చిపోయారని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు.
Leave a comment