ఆర్మూర్, తెలంగాణ వార్త;; కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛభారత్ లో భాగంగా “స్వచ్ఛతాహి సేవ – 2024” అనే పేరిట తెలంగాణ విమోచన దినోత్సవం మరియు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజైన 17 సెప్టెంబర్ నుండి మహాత్మా గాంధీ జయంతి అయినటువంటి అక్టోబర్ 2 వరకు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఆర్మూర్ శాసన సభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు విచ్చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ పేరిట ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉందో పరిసరాల శుభ్రతే కాకుండా మన యొక్క ఆరోగ్యముతో పాటు ప్రతి ఒక్కరి మనస్సు మరియు సంస్కారం కూడా స్వచ్ఛతగా ఉండాలని అప్పుడే ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాజు, వైద్య అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది,పారిశుద్ధ కార్మికుల తో పాటు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment