ఆర్మూర్ (తెలంగాణ వార్త) పీయూసీ చైర్మన్, బీ.ఆర్.యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన సందర్బములో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని అంకాపూర్ శివారులో బి ఆర్ యస్ సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్ ఆధ్వర్యములో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి ఆర్మూర్ పట్టు శాలువాతో, గజ మాలతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ఘన సన్మానం చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దాదాపు 300 వందల బైకులతో అర్గుల్ శివారు నుంచి అంకాపూర్ ఎమ్మెల్యే ఇంటి వద్ద వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఖాందేష్ మరియు వారి సహచరులు “జీవన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి” అని నినాదాలు చేసారు. ఎమ్మెల్యే కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఆర్మూర్ పట్టణ బీఆర్ యస్ పార్టీ యూత్ అధ్యక్షులు పృత్వి రాజ్, నీరడి రాజా, యూత్ జిల్లా నాయకులు షాహిద్, జాగృతి కన్వీనర్ మక్కల సాయినాథ్, మీరా శ్రావణ్, రష్యద్, బికిని శ్రావణ్, ప్రవీణ్, బబ్లు, అద్నాన్, అఫ్రోజ్, అదిల్, చింటూ, శ్యామ్యూల్, ప్రశాంత్ మరియు 300 మంది యువకులు పాల్గొన్నారు.
Leave a comment