Home జనరల్ ఆర్మూర్ లో దొంగల బీభత్సం. 5 దుకాణాలు ఒక మినీ ఫిన్ కేర్ ఫైనాన్స్ లో చోరి!!
జనరల్

ఆర్మూర్ లో దొంగల బీభత్సం. 5 దుకాణాలు ఒక మినీ ఫిన్ కేర్ ఫైనాన్స్ లో చోరి!!

ఆర్మూర్, తెలంగాణ వార్త: డిసెంబర్24: ఆర్మూర్ లో దొంగల బీభత్సం పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రక్కన వీక్లీ మార్కెట్ వెళ్లే రోడ్డులో ఉన్నటువంటి ఐదు దుకాణాలపై రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు బీభత్సవం సృష్టించారు. అందులో మినీ ఫైనాన్స్ ఫిన్ కేర్, హరిహర, ఆర్ఎంపి హాస్పిటల్, ధ్వని డ్రెస్సెస్, రాందేవ్ హోల్సేల్, పద్మావతి డ్రెస్సెస్ దుకాణాల్లో దొంగలు దొంగతనానికి రాత్రి సమయంలో పాల్పడ్డట్టు దుకాణాల యజమానిలు స్థానికులు తెలిపారు.
ఈ దొంగలు కేవలం డబ్బులనే టార్గెట్ చేస్తూ దుకాణాలలో ఉన్న కౌంటర్లలో డబ్బులను తీసే ప్రయత్నంలో దుకాణాలలో వెయ్యి నుండి ఐదు వేల రూపాయల లోపు దొంగతనం జరిగిందని యజమానులు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ దొంగతనాన్ని స్థానికుల సమాచారం మేరకు యజమానులు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన ఘటనాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page