Home జనరల్ అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించిన బహుజన పార్టీ నాయకులు..
జనరల్

అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించిన బహుజన పార్టీ నాయకులు..

గౌరవెల్లి (తెలంగాణ వార్త )గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు అండగా పోరాటం చేయడానికి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ నాయకులు హుస్నాబాద్ అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ER మోహన్ గారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కల్వకుంట్ల కుటుంబానికో న్యాయం, తెలంగాణ ప్రజలకో న్యాయం జరుగుతుంది అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భునిర్వాసితులను ఇప్పటివరకు పూర్తి స్థాయి పరిహారం అందలేదు. అదేవిధంగా గౌరవేల్లి భూ నిర్వాసితులకు కూడా పరిహారం ఇవ్వకుండా ఈ నెల 20 వ తారికున కేటీఆర్ పర్యటన ఉండడం తో భూనిర్వాసితులు చేస్తున్న దీక్షను అన్యాయంగా,బలవంతంగా అణిచివేస్తున్నారు. అక్కడికి కనీసం మీడియాను కూడా అనుమతి ఇవ్వడం లేదు అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కాం లో ఢిల్లీ వెళ్తే ఆమెకు అండగా కేటీఆర్, హరీష్ రావు, BRS నాయకులు అండగా వెళ్లారు. కానీ గౌరవేల్లి భునిర్వాసితులను కలవడానికి వెళ్తే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. గౌరవేల్లి భునిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా కేటీఆర్ పర్యటన చేస్తే కచ్చితంగా అడ్డుకుంటామని ,వారికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జులు డేగల వెంకటేష్, లింగంపల్లి యాదగిరి ,జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్, కోశాధికారి రోమాల బాబు, హుస్నాబాద్ అసెంబ్లీ ఇంచార్జి ఎనగందుల శంకర్, అసెంబ్లీ అధ్యక్షులు రాజు, గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్,మండల నాయకులు, సెక్టార్ నాయకులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page