Home జనరల్ బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం. హైడ్రా చీఫ్ రంగనాథ్…
జనరల్

బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం. హైడ్రా చీఫ్ రంగనాథ్…


ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా..

హైదరాబాద్, తెలంగాణ వార్త :: రాష్ట్రంలోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతల్లోె జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్న హైడ్రా (HYDRA) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా.. బ్యాంకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనుంది. లీగల్ టీంను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిద్ధం చేశారు. ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థల జాబితాను ఇప్పటికే హైడ్రా సిద్ధం చేసింది. చెరువుల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా రుణాలు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు.

సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ కామెంట్స్..

కాగా.. జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టిన హైడ్రా బ్రేకుల్లేండా దూసుకెళ్తోంది. హైడ్రాకు ప్రభుత్వం కూడా హైపవర్స్‌ ఇచ్చేసింది. ఇప్పటి వరకు దాదాపు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఆక్రమణకు గురైన 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించగా.. వెంటనే హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి కూల్చివేతలు చేస్తున్నాయి. హై రీచ్ జా క్రషర్స్‌తో పాటు జేసీబీలతో, బుల్డోజర్ల తో కూల్చివేతలు సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు జీహెచ్‌ఎంసీ ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు కొనసాగింది.

ఇటీవల కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో…

ఇటీవల కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు

అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు17 గంటలపాటు హైడ్రా నాన్ స్టాప్ కూల్చివేతలు చేపట్టింది. ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలను కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు ఆనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సుమారు 17 గంటల పాటు హైరిస్క్ ఆపరేషన్‌ను హైడ్రా కొనసాగించింది

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఫేక్ న్యూస్ తో షేక్ చేస్తున్న యూట్యూబ్, టీవీ ఛానెల్స్ నవ్వుకుంటున్న విద్యార్థులు..

తెలంగాణ వార్త:: ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లలో వచ్చే వార్తలను ప్రజలు నమ్మి...

జనరల్

ఫారెన్ అమ్మాయిల తో గచ్చిబౌలిలోని తెలంగాణ ఎన్జీవోస్ కాలనీ లో వ్యభిచారం.

తెలంగాణ వార్త: గచ్చిబౌలిలోని గౌడిదొడ్డి రోడ్డు వద్ద తెలంగాణ ఎన్జీవోస్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా...

జనరల్

పెర్కిట్ వి.డి.సి అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చే వాల్ భోజరాజ్ ను ఘనంగా సన్మానించిన జి జి ఫౌండేషన్..

పెర్కిట్ వి.డి.సి అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చే వాల్ భోజరాజ్ ను ఘనంగా సన్మానించిన జి జి...

జనరల్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు?

Telangana varta: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్...

You cannot copy content of this page