ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ మండల్ చేపూర్ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు.
రెండవ రోజు పురోహితుడు శ్రీ కిరణ్ కుమార్ జ్యోషి వారి అనుచరులతో యజ్ఞ హోమం మరియు ఇతర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఇట్టి పూజ మరియు హోమం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సాయన్న మరియు గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు సోక్కం సంజీవ్, బొబ్బిలి అనిల్ కుమార్ మాజీ ఎంపీటీసీ జన్నపల్లి గంగాధర్ డీలర్ గణేష్ గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.
Leave a comment